ఇటలీ, దక్షిణ కొరియా నుంచి వచ్చే భారతీయులకు కరోనా సోకనట్లు ధ్రువపత్రం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-06T08:38:02+05:30 IST

ఇటలీ, దక్షిణ కొరియా వెళ్లి తిరిగి రావాలనుకునే భారతీయులకు సంబంధించిన వీసా నిబంధనల్లో కేంద్రం మరో నిబంధనను చేర్చింది. వారు కచ్చితంగా ....

ఇటలీ, దక్షిణ కొరియా నుంచి వచ్చే భారతీయులకు కరోనా సోకనట్లు ధ్రువపత్రం తప్పనిసరి

  • వీసా నిబంధనల్లో తాత్కాలిక మార్పు: హర్షవర్దన్‌

న్యూఢిల్లీ, మార్చి 5: ఇటలీ, దక్షిణ కొరియా వెళ్లి తిరిగి రావాలనుకునే భారతీయులకు సంబంధించిన వీసా నిబంధనల్లో కేంద్రం మరో నిబంధనను చేర్చింది.  వారు కచ్చితంగా అక్కడి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని, కరోనా సోకనట్లు ధ్రువపత్రాలను తీసుకురావాలని కోరింది. ఈ నిర్ణయం 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక నిబంధనను ఎత్తేస్తామని వెల్లడించింది. కాగా, భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో కేరళ నుంచి ముగ్గురు కోలుకున్నారని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ పార్లమెంటులో వెల్లడించారు. అన్ని విమానాశ్రయాల్లో బుధవారం నుంచి ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాల్లో జిల్లాలు, గ్రామాల స్థాయిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌అను ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2020-03-06T08:38:02+05:30 IST