కేన్స్‌లో భారత వర్చువల్‌ పెవిలియన్‌

ABN , First Publish Date - 2020-06-23T08:20:16+05:30 IST

కేన్స్‌ ఫిల్మ్‌ మార్కెట్‌లో భారత వర్చువల్‌ పెవిలియన్‌ను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ప్రారంభించారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు...

కేన్స్‌లో భారత వర్చువల్‌ పెవిలియన్‌

  • ప్రారంభించిన కేంద్ర మంత్రి జవడేకర్‌


న్యూఢిల్లీ, జూన్‌ 22: కేన్స్‌ ఫిల్మ్‌ మార్కెట్‌లో భారత వర్చువల్‌ పెవిలియన్‌ను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ప్రారంభించారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల చలనచిత్ర బోర్డులకు ఇక్కడ ఇదివరకే పెవిలియన్‌లు ఉండగా.. భారత్‌ తాజాగా ప్రారంభించింది. దీనిద్వారా భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని, దేశీయంగా సినిమా పరిశ్రమ వృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని జవడేకర్‌ పేర్కొన్నారు. ఈ ఏడు మే నెలలో జరగాల్సిన  కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌.. కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇక్కడ ఐదు రోజుల పాటు ప్రపంచ భాషల సినిమాలను వర్చువల్‌గా ప్రదర్శిస్తారు.  భారతీయ సినిమాలనూ ప్రదర్శిస్తారు. ఈ వేడుక శుక్రవారంతో ముగుస్తుంది.


Read more