బ్లడ్ సర్వీస్ యాప్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి

ABN , First Publish Date - 2020-06-25T19:21:27+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ బ్లడ్ సర్వీస్ యాప్‌ను విడుదల చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

బ్లడ్ సర్వీస్ యాప్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ బ్లడ్ సర్వీస్ యాప్‌ను విడుదల చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి రక్తం ఎక్కడ అందుబాటులో ఉందో తెలుస్తుందని మంత్రి చెప్పారు. రక్తం కావాలనుకునేవారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందేలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దాతల నుంచి రక్తం సేకరించాలని, ప్రస్తుత సమయంలో ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ అని మంత్రి చెప్పారు. 




మరోవైపు దేశంలో ఇప్పటివరకూ 4,73, 105 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 16, 922 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో 418 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14, 894కు చేరింది. ఇప్పటివరకూ 2, 71, 697 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 57.43 శాతానికి చేరింది.

Updated Date - 2020-06-25T19:21:27+05:30 IST