రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..!

ABN , First Publish Date - 2020-09-29T23:41:21+05:30 IST

భారతీయ రైల్వే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. యూజర్ ఛార్జీల పేరుతో...

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..!

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. యూజర్ ఛార్జీల పేరుతో టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ యూజర్ ఛార్జీల పేరుతో వచ్చిన సొమ్మును భారత్ లోని కొన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేటాయించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ యూజర్ ఛార్జీలు 10 రూపాయలు మొదలుకుని 35 రూపాయల వరకూ ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే.. ఇలా యూజర్ ఛార్జీలను విధించాలని భారతీయ రైల్వే భావిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూజర్ డెవలప్‌మెంట్ ఫీ(యూడీఎఫ్) పేరుతో ఈ ఛార్జీలను విధించనున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-09-29T23:41:21+05:30 IST