మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు

ABN , First Publish Date - 2020-04-14T17:50:52+05:30 IST

న్యూఢిల్లీ: మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ: మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కాసేపటికే రైల్వే ఈ స్పష్టత ఇచ్చింది. ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అవసరమైన సామాగ్రి, వస్తువులు,పార్సెల్ రైలు సర్వీసులు కొనసాగుతాయి. 


తొలివిడత( ఏప్రిల్ 14) తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా ఆశించారు. రైల్వే అనుమతించడంతో ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కూడా కొన్నారు. అయితే మే 3 వరకూ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటికే కొన్న టికెట్లకు వంద శాతం డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. 


Updated Date - 2020-04-14T17:50:52+05:30 IST