ప్రతి దాడికీ ఆందోళన చెందేలా మా స్పందన ఉంటుంది : బధూరియా హెచ్చరిక

ABN , First Publish Date - 2020-05-18T20:00:53+05:30 IST

దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తితే మాత్రం 24x7 పనిచేయడానికి సదా సిద్ధంగానే ఉన్నామని

ప్రతి దాడికీ ఆందోళన చెందేలా మా స్పందన ఉంటుంది : బధూరియా హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తితే మాత్రం 24x7 పనిచేయడానికి సదా సిద్ధంగానే ఉన్నామని భారత వైమానిక దళం చీఫ్ బధూరియా సోమవారం ప్రకటించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద క్యాంపులు, లాంచ్‌ప్యాడ్‌లపై యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు.


‘‘పరిస్థితులు గనుక తీవ్రతరమై, డిమాండ్ చేస్తే మాత్రం 24 x7 పనిచేయడానికి వైమానిక దళం సిద్ధంగా ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఉగ్రవాద శిబిరం లేదా లాంచ్‌ప్యాడ్‌పై దాడులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం’’ అని తేల్చి చెప్పారు.


ఈ దేశంపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడల్లా, పాకిస్తాన్ ఆందోళన చెందుతూనే ఉండాలని, కచ్చితంగా ఆందోళన చెందేలా తాము స్పందిస్తామని ఆయన ప్రకటించారు. దాయాది ఈ ఆందోళనల నుంచి బయటపడాలంటే మాత్రం భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగదోయడం మానుకోవాల్సిందేనని బధూరియా తీవ్రంగా హెచ్చరించారు. 

Updated Date - 2020-05-18T20:00:53+05:30 IST