ఇండియానే సరిహద్దు దాటి దాడి చేసింది: చైనా పత్రిక
ABN , First Publish Date - 2020-06-17T02:56:29+05:30 IST
భారత భూభాగంలోకి చొచ్చుకురావడమే కాకుండా సైనికులపై దాడులకు దిగి వారి ప్రాణాలను సైతం బలిగొంటోంది...

బీజింగ్: భారత భూభాగంలోకి చొచ్చుకురావడమే కాకుండా సైనికులపై దాడులకు దిగి వారి ప్రాణాలను సైతం బలిగొంటోంది చైనా మిలటరీ. అయితే ఆ దేశపు మీడియా మాత్రం ఇండియానే చైనా భూభాగంలోకి చొచ్చుకొచ్చిందని కథనాలు రాస్తోంది. ముఖ్యంగా ఆ దేశపు ప్రధాన పత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్‌పై విషం కక్కుతోంది. గల్వాన్ లోయ వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(వాస్తవాధీన రేఖ) దాటి భారత సైన్యం చైనాలోకి చొరబడిందని ఆరోపించింది. అంతేకాకుండా చైనా పీపుల్స్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం భారత సైన్యం చైనా సైన్యంపై దాడులకు కూడా పాల్పడుతోందని, దీనివల్ల అనేకమంది చైనా సైనికులు గాయాలపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.