భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ చైనా సైన్యంతో సంబంధాలున్న చైనా కంపెనీల గుర్తింపు

ABN , First Publish Date - 2020-07-18T22:39:49+05:30 IST

మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ వర్క్ నిర్వహిస్తున్న

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ చైనా సైన్యంతో సంబంధాలున్న చైనా కంపెనీల గుర్తింపు

న్యూఢిల్లీ : మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ వర్క్ నిర్వహిస్తున్న చైనా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా సైన్యం దాడి చేసిన నేపథ్యంలో 59 చైనీస్ మొబైల్ యాప్‌లను నిషేధించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన దర్యాప్తులో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో సంబంధాలు పెట్టుకుని, మన దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలను గుర్తించింది. 


చైనా చట్టాలే ప్రోత్సహిస్తున్నాయి...

మన దేశంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించే విధంగా చైనా కంపెనీలను ఆ దేశ చట్టాలే ప్రోత్సహిస్తున్నాయి. 2017 జూన్‌లో చైనా చట్ట సభ నూతన ఇంటెలిజెన్స్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అనుమానితులను పర్యవేక్షించేందుకు, ప్రాంగణాలపై దాడి చేసి, సోదాలు చేసేందుకు, పరికరాలను, వాహనాలను జప్తు చేసేందుకు అధికారాలు పొందింది. 


ఈ చట్టానికి అనుగుణంగా చైనా జాతీయ నిఘా వ్యవస్థలకు సహకరించాలని చైనా కంపెనీలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. చైనా కంపెనీలు ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తే, ఆ దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో చైనా ప్రభుత్వానికి సహకరించాలని తెలిపింది. హువావెయి, జెడ్‌టీఈ, టిక్ టాక్ వంటి చైనా కంపెనీలు తాము పని చేస్తున్న దేశాల్లో ఈ చట్ట ప్రకారం చైనా నేషనల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు సహకరించాలని, సహాయం అందజేయాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. 


ఈ ఇంటెలిజెన్స్ చట్టంలోని అధికరణ 7 ప్రకారం, ఆర్గనైనేషన్ లేదా వ్యక్తి స్టేట్ ఇంటెలిజెన్స్ వర్క్‌లో సహాయ, సహకారాలు అందించవలసి ఉంటుంది. ఈ విధంగా సహకరించేవారికి చైనా రక్షణ కల్పిస్తుంది. 


చైనా నుంచి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)పై ఈ చట్టం ప్రభావం స్పష్టంగా ఉంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకుని, భారత దేశంలో పని చేస్తున్న కొన్ని చైనా కంపెనీలు ...


1.  కర్ణాటకలోని కొప్పల్‌లో ఏర్పాటు చేసిన ఎక్స్ఇండియా స్టీల్స్ లిమిటెడ్

2. ఛత్తీస్‌గఢ్‌లోని జింజింగ్ కెథే ఇంటర్నేషనల్ గ్రూప్

3. ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు 2018లో ప్రకటించిన చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్

4. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్లు, మొబైల్ కమ్యూనికేషన్ల తయారీ కంపెనీ హువావెయి. 


Updated Date - 2020-07-18T22:39:49+05:30 IST