భార‌త్‌లోనూ ర‌ష్యా వ్యాక్సిన్ త‌యారీ... మొద‌లైన చ‌ర్చ‌లు!

ABN , First Publish Date - 2020-08-16T10:45:27+05:30 IST

రష్యా తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విపై ప‌లు‌ భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాక్సిన్‌కు చెందిన‌ మొదటి, రెండ‌వ ద‌శ‌ల‌ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని...

భార‌త్‌లోనూ ర‌ష్యా వ్యాక్సిన్ త‌యారీ... మొద‌లైన చ‌ర్చ‌లు!

న్యూఢిల్లీ: రష్యా తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విపై ప‌లు‌ భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వ్యాక్సిన్‌కు చెందిన‌ మొదటి, రెండ‌వ ద‌శ‌ల‌ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించాలని భారత కంపెనీలు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (ఆర్డీఐఎఫ్)ను కోరాయి. ఆర్డీఐఎఫ్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి  సంబంధించిన పరిశోధన, విచారణకు నిధులు సమకూర్చింది. ఈ టీకాను మార్కెటింగ్‌తో పాటు ఎగుమతి చేసే హక్కు ఆర్డీఐఎఫ్‌కు ఉంది. స్పుత్నిక్ వి ప్రపంచంలో మొట్టమొదటి రిజిస్టర్డ్ కరోనా టీకా. ఈ సంస్థ‌తో భారతీయ కంపెనీల చర్చలు ముందుకు సాగితే, ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి. రష్యా రాయబార కార్యాలయ వర్గాలు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం ఈ టీకాకు సంబంధించి భారతీయ కంపెనీలు ఆర్డీఐఎఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ కంపెనీలు ఫేజ్ -1, ఫేజ్ -2 ట్రయల్స్‌కు సంబంధించిన‌ సాంకేతిక సమాచారాన్ని కోరాయి. ఈ టీకాను రష్యాకు చెందిన మైక్రో బయాలజీ రీసెర్చ్ సెంటర్ గ‌మ్‌లెయా అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌ కొన‌సాగుతున్నాయి. 

Updated Date - 2020-08-16T10:45:27+05:30 IST