చైనాలో చిక్కుకున్న భారత నౌకలు

ABN , First Publish Date - 2020-12-26T09:06:09+05:30 IST

భారత్‌కు చెందిన రెండు కార్గో నౌకలు చైనాలో నిలిచిపోయాయి. రెండింటిలో కలిపి 39మంది భారతీయులున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు...

చైనాలో చిక్కుకున్న భారత నౌకలు

బీజింగ్‌, డిసెంబరు 25: భారత్‌కు చెందిన రెండు కార్గో నౌకలు చైనాలో నిలిచిపోయాయి. రెండింటిలో కలిపి 39మంది భారతీయులున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘హిబే ప్రావిన్స్‌లోని జింగ్‌టాంగ్‌ పోర్టులో ‘ఎంవీ జగ్‌ ఆనంద్‌’ నౌక ఈ ఏడాది జూన్‌ 13 నుంచి నిలిచిపోయింది. అం దులో 23మంది భారతీయులున్నారు. మరో నౌక అనస్తాసియా, చావోఫీడియన్‌ పోర్టులో ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి నిలిచిపోయింది. దీనిలో 16మంది భారతీయులున్నారు. నౌకల్లోని సరుకును దించేందుకు చైనా అ నుమతినివ్వడం లేదు. దీంతో రెండు నౌకల సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నా రు. సంబంధిత అధికారులందరితో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్ని  కనీసం పోర్టులో లంగరు వే సి, సిబ్బందిని మార్చేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది’’ అని అనురాగ్‌ వెల్లడించారు. మరోవైపు.. నౌకలు నిలిపేయడానికి, సరిహద్దులో భారత్‌తో ఉద్రిక్తతలతో ఎటువంటి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మీడియాకు తెలిపారు. క్వారంటైన్‌ నిబంధనల కారణంగానే వాటిని ఆపినట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-26T09:06:09+05:30 IST