కోవిడ్-19 : భారత ఆర్మీ కమాండర్ల సదస్సు వాయిదా

ABN , First Publish Date - 2020-04-08T20:22:55+05:30 IST

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16న జరగాల్సిన ఆర్మీ కమాండర్ల ...

కోవిడ్-19 : భారత ఆర్మీ కమాండర్ల సదస్సు వాయిదా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16న జరగాల్సిన ఆర్మీ కమాండర్ల ద్వైవార్షిక సదస్సును వాయిదా వేస్తున్నట్టు భారత ఆర్మీ ప్రకటించింది. ‘‘కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ 16 నుంచి జరగాల్సిన ద్వైవార్షిక ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్సును భారత ఆర్మీ వాయిదా వేసింది. ఈ సమావేశంలో సైనిక దళాల అధిపతి దేశంలోనూ, దేశం చుట్టుపక్కల భద్రతా పరిస్థితితో పాటు వివిధ కీలక అంశాలను కమాండర్లతో చర్చించాలని భావించారు...’’ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో... ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 5,194కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Updated Date - 2020-04-08T20:22:55+05:30 IST