ఆర్మీలో టూర్ ఆఫ్ డ్యూటీ.. సాధారణ పౌరులకు దేశ సేవ చేసే అవకాశం

ABN , First Publish Date - 2020-05-14T04:09:16+05:30 IST

దేశ సేవ చేయాలనుకునే సాధారణ పౌరుల కోసం భారత్ ఆర్మీ కొత్త అవకాశాన్ని కల్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆర్మీలో టూర్ ఆఫ్ డ్యూటీ.. సాధారణ పౌరులకు దేశ సేవ చేసే అవకాశం

న్యూఢిల్లీ: దేశ సేవ చేయాలనుకునే సాధారణ పౌరుల కోసం భారత్ ఆర్మీ కొత్త అవకాశాన్ని కల్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి నుంచీ మూడేళ్ల పాటు సైనిక దళంలో పనిచేసే అవకాశం కల్పించేందుకు టూర్ ఆఫ్ డ్యూటీ పేరిట కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. యువతను ఆర్మీలోకి ఆకర్షించేందుకే ఈ కొత్త విధానమని ఆర్మీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం సైనిక దళంలో పదేళ్ల పాటు సేవలందించే అవకాశాన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం సైనిక దళంలో ఆఫీసర్ స్థాయి అధికారులు 42,253 మంది ఉంటే..11.94 లక్షల మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. త్రివిధ దళాల్లోని జవాన్ల స్థాయిలో ఉన్న సిబ్బంది రిటైర్మెంట్ వయసును పెంచాలని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. 

Read more