మోదీ అబద్దాలపై దేశం మూల్యం చెల్లించుకుంటుంది: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-07-20T02:04:29+05:30 IST

ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని రాహుల్ గతంలో జోస్యం చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ఉత్తమైన ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అయితే ఆయన చెప్పినట్లు కేసులు

మోదీ అబద్దాలపై దేశం మూల్యం చెల్లించుకుంటుంది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్, భారత జీడీపీ, చైనా దూకుడుపై మోదీ ప్రభుత్వం చెబుతున్న అబద్దాల వల్ల దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అబద్ధాలే రాజ్యమేలుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.


‘‘బీజేపీ వీలైనన్ని అబద్దాలు చెబుతుంది. కోవిడ్-19 పరీక్షలు, మరణాల విషయంలో వాస్తవాలు దేశ ప్రజలకు తెలియనివ్వడం లేదు. కొత్త గణన పద్దతి ద్వారా జీడీపీని సరిగా అంచనా వేయలేకపోతున్నారు. మీడియాను భయపెట్టడుతూ చైనా దూకుడును దేశానికి తెలియకుండా దాస్తున్నారు. భ్రమలు త్వరలోనే తొలగిపోతాయి. కానీ మోదీ చెప్పే అబద్దాలకు దేశం మూల్యం చెల్లించుకుంటుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.


ఆగస్టు 10 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని రాహుల్ గతంలో జోస్యం చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ఉత్తమైన ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అయితే ఆయన చెప్పినట్లు కేసులు 20 లక్షల మార్క్‌ను చేరకపోయినప్పటికీ పరిస్థితి మాత్రం తీవ్రంగానే మారింది. ఇక చైనా సేనలు లధాఖ్‌ సరిహద్దులోకి అడుగుపెట్టడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమని రాహుల్ విమర్శించారు.

Updated Date - 2020-07-20T02:04:29+05:30 IST