కరోనా టెస్టులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! మే నెలాఖరు కల్లా...

ABN , First Publish Date - 2020-04-29T04:05:21+05:30 IST

కరోనా టెస్టు పరికరాల తయారీ విషయంలో మేనెలాఖరుకల్లా స్వావలంబన సాధిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.

కరోనా టెస్టులపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! మే నెలాఖరు కల్లా...

న్యూఢిల్లీ: కరోనా టెస్టు పరికరాల తయారీ విషయంలో మేనెలాఖరుకల్లా స్వావలంబన సాధిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. వ్యాధి నిర్ధారణకు ప్రధానమైన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షతో పాటూ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టు కిట్లను కూడా భారత్‌లో ఉత్పత్తి అవుతాయని ఆయన్న అన్నారు. రోజుకు దాదాపు లక్ష టెస్టులు చేయగలిగే స్థితి చేరుకుంటామని తెలిపారు. కరోనా కట్టడికై డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తీసుకుంటున్న చర్యలను ఆయన మంగళావారం నాడు సమీక్షించారు. వ్యాక్సిన్ రూకల్పనలో డజనుకు పైగా సంస్థలకు ప్రభుత్వం సహాయం అందుతోందని, వీటిలో నాలుగు సంస్థలు వ్యాక్సిన్ రూపకల్పనలో చాలా పురోగతి సాధించాయని హర్ష వర్ధన్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు పొందే విషయంలో కంపెనీలకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ఉండేందుకు పటిష్ట ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసామని మంత్రి అన్నారు. 


Updated Date - 2020-04-29T04:05:21+05:30 IST