భారత్ కీలక నిర్ణయం.. చైనా, పాక్‌లతో 15 రోజుల మహాయుద్ధం కోసం..

ABN , First Publish Date - 2020-12-13T19:33:56+05:30 IST

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో తొలగిపోని నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలను పెంచుకునేందుకు త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది.

భారత్ కీలక నిర్ణయం.. చైనా, పాక్‌లతో 15 రోజుల మహాయుద్ధం కోసం..

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో తొలగిపోని నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాక్‌లతో 15 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిపేందుకు వీలుగా అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిల్వలను పెంచుకునేందుకు త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు అత్యవసర ఆర్థిక అధికారల ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.  దీంతో..ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు ఆయుధాల నిల్వలు పెంచుకునేందుకు రూ. 50 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు చేసేందుకు సిద్ధమయ్యాయి. దేశీ తయారీ దారులతో పాటూ విదేశీ సంస్థలకు కూడా త్రివిధ దళాలు ఆర్డర్‌లు పెట్టనున్నాయి. 


అంతకుమనుపు.. భారత్ భద్రతాదళాలు 10 రోజుల యుద్ధానికి సరిపడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే..చైనా పాక్‌లతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదురవచ్చనే దృష్టితో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే..ప్రస్తుతం భారత్‌ ఆయుధ నిల్వల స్థాయి 10-ఐ నుంచి 15-ఐకి పెరగనుంది. వాస్తవానికి..భారత్ 40 రోజుల యుద్ధానికి సరిపడా ఏర్పాటు చేస్తుకోవాల్సి ఉంది. అయితే..అప్పటి పరిస్థితుల దృష్ట్యా మునుపటి ప్రభుత్వాలు దీన్ని పది రోజులకు కుదించాయి. ఆయుధాలు, అమ్యునిషన్(మందుగుండు సామాగ్రి) స్టోర్ చేసేందుకు కావాల్సిన మౌలిక వసుతుల లేమి, మారుతున్న యుద్ధతంత్రాలు, అవసరాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నాయి.


కాగా.. ఇటీవల పాక్, చైనా భారత్‌తో తగవుకు దిగుతుండటంతో కేంద్రం పాత స్థితికి బ్రేక్ చెబుతూ తాజా ఆదేశాలు జారీచేసింది. రూ. 300 కోట్ల విలువైన అత్యవసర కొనుగోళ్లు చేపట్టేందుకు త్రివిధ దళాలకు కేంద్రం ఇదివరకే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత భత్రతా దళాలు విస్తృత స్థాయిలో రక్షణ కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఆయుధాలకు సంబంధించి స్పేర్ పార్ట్స్, మందుగుండు సామాగ్రి, మిస్సైల్ వ్యవస్థలను సేకరిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..భారత్ వద్ద మిసైళ్లు, యుద్ధ ట్యాంకులు, వాటిల్లో వాడే అమ్యునిషన్ నిల్వలు సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెంచే స్థాయికి చేరుకున్నాయి.Updated Date - 2020-12-13T19:33:56+05:30 IST