కరోనా పోరుకు.. భారత్‌కు 7వేలకోట్లపైగా రుణం!

ABN , First Publish Date - 2020-05-14T00:57:50+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

కరోనా పోరుకు.. భారత్‌కు 7వేలకోట్లపైగా రుణం!

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం చేపడుతున్న చర్యలకు బ్రిక్స్ దేశాలకు చెందిన ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’ ఆర్థికసాయం ప్రకటించింది. భారత్‌కు 1 బిలియన్ డాలర్లు(రూ.7.5వేలకోట్లపైగా) రుణం అందించాలని ఈ బ్యాంకు నిర్ణయించింది. ఏప్రిల్ 30న ఈ రుణానికి బ్యాంకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని నిరోధించి తద్వారా సామాజిక, ఆర్థిక, ప్రాణ నష్టాలు జరగకుండా చూసేందుకు ఈ రుణం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more