దేశం వ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 22 వేల మందికి కరోనా..
ABN , First Publish Date - 2020-07-08T17:42:35+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చుంతోంది. గడచిన 24 గంటల్లో...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 22,752 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 7,42,417కు పెరిగినట్టు తెలిపింది. ఇందులో ఇప్పటి వరకు 4,56,830 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... 2,64,944 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 482 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కాగా 2,17,121 కరోనా నిర్ధారిత కేసులతో మహారాష్ట్ర ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 9,250కి చేరింది. తమిళనాడులో 1,18,594 మందికి కరోనా నిర్ధారణ కాగా.. 1,636 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 1,02,831 మందికి కరోనా సోకినట్టు గుర్తించగా.. ఇప్పటి వరకు ఇక్క 3,165 మంది మృత్యువాత పడ్డారు.