ఎంఆర్ఎన్ఎ కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి
ABN , First Publish Date - 2020-12-10T13:57:44+05:30 IST
భారతదేశపు తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ హెచ్‌జీసీఓ19కు ఫస్ట్ ఫేజ్, సెకెండ్ ఫేజ్‌ల క్లినికల్ ట్రయల్‌కు...

న్యూఢిల్లీ: భారతదేశపు తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ హెచ్‌జీసీఓ19కు ఫస్ట్ ఫేజ్, సెకెండ్ ఫేజ్‌ల క్లినికల్ ట్రయల్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనిమతిచ్చింది. దీనిని జన్నోవా బయోఫార్మసూచికల్స్ తయారుచేసింది.
పూణెలో ఉన్న ఈ సంస్థ హెచ్డీటీ బయోటెక్ కార్పొరేషన్(యూఎస్ఏ) భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా సబ్జక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) సభ్యులు మాట్లాడుతూ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఎస్ఐ), భారత్ బయోటెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు సంబంధించి మరింత డేటా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వ్యాక్సిన్ రూపొందించిన మరో కంపెనీ ఫైజర్‌కు ప్రజంటేషన్‌కు మరికొంత సమయం పడుతుందన్నారు.