రేపటి నుంచి భారత్‌-రష్యా నేవీ విన్యాసాలు

ABN , First Publish Date - 2020-09-03T08:30:12+05:30 IST

భారత్‌, రష్యా నావికాదళాలు ఈనెల 4, 5 తేదీల్లో బంగాళాఖాతంలో మెగా నేవీ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరుదేశాల నావికాదళాలు లాజిస్టిక్‌ ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో...

రేపటి నుంచి భారత్‌-రష్యా నేవీ విన్యాసాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: భారత్‌, రష్యా నావికాదళాలు ఈనెల 4, 5 తేదీల్లో బంగాళాఖాతంలో మెగా నేవీ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇరుదేశాల నావికాదళాలు లాజిస్టిక్‌ ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో తాజా విన్యాసాలు ఇరుదేశాల నేవీ సహకారాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు. నెల కిందట భారత్‌, అమెరికా నావికాదళాలు సంయుక్త విన్యాసాలు జరిపిన ప్రాంతంలోనే ఈ విన్యాసాలు జరుగనున్నాయి.  

Updated Date - 2020-09-03T08:30:12+05:30 IST