‘ఆసియన్’తో అనుసంధానం పెంపునకు ప్రాధాన్యం:మోదీ
ABN , First Publish Date - 2020-11-13T08:49:51+05:30 IST
ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియన్)తో అన్ని అంశాల్లో అనుసంధానం పెంపొందించుకోవడం భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు...
న్యూఢిల్లీ, నవంబరు 12: ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియన్)తో అన్ని అంశాల్లో అనుసంధానం పెంపొందించుకోవడం భారత్‌కు అత్యంత ప్రధానమైన అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా డిజిటల్, సామాజిక, ఆర్థిక, ద్రవ్య, నౌక సంబంధమైన విషయాల్లో ఆసియన్ దేశాలతో దగ్గరయ్యామని చెప్పారు. భారత్, ఆసియన్ మధ్య గురువారం 17వ శిఖరాగ్ర సదస్సు వర్చువల్‌గా జరిగింది. భారత్-ఆసియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక పరమైన అంశాలే పునాది అని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. చైనాతో లద్ధాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండటం, ఆసియన్‌లోని కొన్ని దేశాలకు చైనా, దక్షిణ చైనా సముద్రంలో ప్రాదేశిక పరమైన వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.