నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్!

ABN , First Publish Date - 2020-05-10T20:37:36+05:30 IST

సరిహద్దు వద్ద భారత్ నిర్మించిన రోడ్డుపై నేపాల్ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది.

నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్!

న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద భారత్ నిర్మించిన రోడ్డుపై నేపాల్ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చింది. భారత్ భూభాగంలోనే రోడ్డు నిర్మాణం జరిగిందని, అంతకుమునుపు ఉన్న దారి స్థానంలోనే కొత్త రహదారిని నిర్మించామని స్పష్టం చేసింది. ఉత్తరఖండ్‌లో ధర్‌చౌలా టౌన్‌ను లిపూలేఖ్ పాస్‌తో అనుసంధానిస్తూ నూతన రహదారిని భారత్‌ నిర్మించిన విషయం తెలిసిందే. 17 వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ రహదారిని(80 కీమీల పొడవు) భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు ప్రారంభించారు.  కలైశ్ మానసరోవర్ యాత్ర చేసే వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకే ప్రభుత్వం ఈ రహదారిని నిర్మించింది. అయితే నేపాల్ భారత్‌ల సరిహద్దు వివాదం ఉన్న ప్రాంతంలో ఈ నిర్మాణం జరిగిందంటూ నేపాల్ అభ్యంతరం  వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందానికి భారత ఏకపక్ష నిర్ణయం తూట్లుపొడిచిందని ఆరోపించింది. అయితే భారత్ మాత్రం.. తమ భూభాగంలోనే ఈ నిర్మాణం చేపట్టామంటూ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. 

Updated Date - 2020-05-10T20:37:36+05:30 IST