చైనా-పాక్ ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన! అభ్యంతరం చెప్పిన భారత్!

ABN , First Publish Date - 2020-08-23T05:27:10+05:30 IST

పాక్‌లో చైనా సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి ఇరు దేశాల ఇటీవల చేసిన కీలక ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన రావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

చైనా-పాక్ ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన! అభ్యంతరం చెప్పిన భారత్!

న్యూఢిల్లీ: పాక్‌లో చైనా సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చైనా పాక్ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి ఇరు దేశాల ఇటీవల చేసిన కీలక ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన రావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి విషయాల్లో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. చైనా తల పెట్టిన ఈ మెగా ప్రాజెక్టులో కొంత భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే.  దీనికి భారత్ గతంలోనూ అనేక మార్లు అభ్యంతరం తెలిపింది. మరోవైపు..పాక్‌లోని బలోచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సుల వారు కూడా ఈ ప్రాజెక్టును వ్యతికిస్తున్నారు. 

Updated Date - 2020-08-23T05:27:10+05:30 IST