భారత్‌లో కరోనాపై తాజా అప్‌డేట్ ఇది..!

ABN , First Publish Date - 2020-04-08T02:48:22+05:30 IST

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,789కి చేరుకున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ భారత్‌లో...

భారత్‌లో కరోనాపై తాజా అప్‌డేట్ ఇది..!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,789కి చేరుకున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా బారిన పడి 124 మంది మృతి చెందినట్లు కేంద్రం ప్రకటించింది. ఆసుపత్రుల్లో 4,312 మందికి చికిత్స అందుతుండగా, 352 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 368 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటినట్లు మహారాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.


మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,018కి చేరింది. ఒక్క ముంబై నగరంలోనే 590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని చూపుతోంది. ఢిల్లీలో మంగళవారం రెండు కరోనా మరణాలు, 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


ఉత్తరాఖండ్‌లో మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గోవాలో కూడా మంగళవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గోవాలో ప్రస్తుతానికి నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 7. గుజరాత్‌లో మంగళవారం 19 పాజిటివ్ కేసులు, 2 కరోనా మరణాలు నమోదయినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. హర్యానాలో మంగళవారం 33 కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-08T02:48:22+05:30 IST