మున్ముందు చైనా దిగుమతులను తగ్గించాల్సిందే : రామ్ మాధవ్
ABN , First Publish Date - 2020-06-18T23:09:48+05:30 IST
మున్ముందూ భారత్ వివిధ దేశాల దిగుమతులను తగ్గించుకుంటేనే బాగుటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం

న్యూఢిల్లీ : మున్ముందూ భారత్ వివిధ దేశాల దిగుమతులను తగ్గించుకుంటేనే బాగుటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. ముఖ్యంగా చైనా ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పేర్కొన్నారు. రసాయనాలు, మొబైల్స్ లాంటి వాటిని మానిఫ్యాక్చర్ చేసుకునే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు.
‘‘రసాయనాలు, మొబైల్స్ భాగాలు, బటన్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. అవి దిగుమతి చేసుకునేంత అవసరమా? వాటిని భారత్‌లో కూడా తయారుచేసుకోవచ్చు. ఆయా దేశాల నుంచి దిగుమతులను రానూరానూ తగ్గించుకోవాలి. ముఖ్యంగా చైనా దిగుమతులను’’ అని అభిప్రాయపడ్డారు.
అయితే... చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, వారి మనోభావాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘సరిహద్దును అత్యంత అప్రమత్తతతో కాపాడుకోవడం, మరింత హింస, ప్రాణనష్టం సంభవించకుండా చూసుకోవడం అన్నదే మా మొదటి ప్రాధాన్యం’’ అని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.