భారత్‌పై లేనిపోని భయాలను సృష్టించుకొని.... బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్

ABN , First Publish Date - 2020-12-10T15:58:29+05:30 IST

పాకిస్తాన్ భారత్ అంటేనే వణికిపోతోంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటేనే పాక్ వెన్నులో చలిపుడుతోంది. భారత్ విషయంలో ఉన్నవీ.. లేనివీ..

భారత్‌పై లేనిపోని భయాలను సృష్టించుకొని.... బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ భారత్ అంటేనే వణికిపోతోంది. సర్జికల్ స్ట్రైక్స్ అంటేనే పాక్ వెన్నులో చలిపుడుతోంది. భారత్ విషయంలో ఉన్నవీ.. లేనివీ.. అన్ని తానే సృష్టించుకొని, వణికిపోతోంది. ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనల నుంచి ప్రపంచ దృష్టి మరల్చడానికి భారత్ పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశముందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఓ రిపోర్టు సమర్పించిందట. ఈ విషయాన్ని పాక్ ప్రముఖ పత్రిక ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’’ వెలువరించింది. ప్రపంచ దృష్టి మరల్చడానికి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడే అవకాశం ఉందని, సరిహద్దుల్లో సైన్యం అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు కూడా వెళ్లాయట. ‘‘హిందుత్వవాది నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరసనలను బలహీనపరిచేందుకు ఏమైనా చేయగలదు. ఖలిస్తాన్ ఉద్యమంలాగా ఢిల్లీ రైతుల ఉద్యమం కావాలని భారత్ కోరుకోవడం లేదు.’’ అంటూ ప్రభుత్వం భావిస్తోందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఎల్‌ఓసీ వెంట ఉండే సైనికులను పాక్ ఇప్పటికే అలర్ట్ చేసిందని, భారత్ ఎలాంటి దాడులు చేసినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు వెళ్లాయని ‘‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’’ పేర్కొంది.


ఇక మరో పత్రిక ‘‘జియో న్యూస్’’ కూడా అచ్చు ఇదే రకమైన వాదనను తెరపైకి తెచ్చింది. ‘‘తమ ఆంతరంగికమైన సమస్యలు, బయటి సమస్యలనుంచి దృష్టి మరల్చడానికి పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశాలున్నాయి. అందుకే సైన్యాన్ని అలర్ట్ చేసింది. కశ్మీర్ సమస్య, మైనారిటీల సమస్య, రైతుల ఆందోళన... ఇలా అనేక సమస్యలతో భారత్ ఒత్తిడికి గురవుతోంది. లద్దాఖ్‌లో కూడా భారత్ సవాళ్లను ఎదుర్కొంటోంది.’’ అంటూ జియో న్యూస్ పేర్కొంది. తమపై భారత్ అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని పాక్ చాలా సార్లు ప్రకటించింది. ఇప్పుడు మాత్రం లేనిపోని భయాలను పాకే సృష్టించుకొని... సర్జికల్ స్ట్రైక్స్ అంటూ భయపడిపోతోంది. 

Updated Date - 2020-12-10T15:58:29+05:30 IST