చమురు నిల్వలపై అమెరికాతో ఒప్పందం
ABN , First Publish Date - 2020-07-19T07:17:50+05:30 IST
చమురు నిల్వల కోసం అమెరికాతో భారత్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నిల్వలకు, చమురు రవాణా సమయంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి బీమా సదుపాయం ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు...

న్యూఢిల్లీ, జూలై 18: చమురు నిల్వల కోసం అమెరికాతో భారత్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నిల్వలకు, చమురు రవాణా సమయంలో ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి బీమా సదుపాయం ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. శుక్రవారం ఆయన అమెరికా మంత్రి డాన్ బ్రౌయిలెట్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అమెరికాలో 71.4 కోట్ల బ్యారెళ్లను నిల్వచేసేలా మౌలిక వసతులున్నాయని ఆయన తెలిపారు. భారత చమురు నిల్వల భద్రతకోసం అమెరికాలో ‘యూఎ్‌స-ఇండియా గ్యాస్ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటైందన్నారు.