లాక్ డౌన్ కొనసాగనిస్తే భారత్ పరిస్థితి దిగజారుతుంది: ప్రముఖ ఆర్థికవేత్త

ABN , First Publish Date - 2020-04-06T00:23:47+05:30 IST

ప్రస్తుతం భారత్‌లో అమలవుతున్న లాక్ డౌన్ మరింత కాలం పాటు కొనసాగిస్తే దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ అభ్రిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ కొనసాగనిస్తే భారత్ పరిస్థితి దిగజారుతుంది: ప్రముఖ ఆర్థికవేత్త

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో అమలవుతున్న లాక్ డౌన్ మరింత కాలం పాటు కొనసాగిస్తే దేశ ఆర్థిక స్థితి మరింత దిగజారుతుందని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ అభ్రిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రజలు పలు రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘భారత్‌లో పరిస్థితి ఇప్పటికే ఆందోళన కరంగా ఉంది. ఇక వివిధ తీవ్రతలతో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్లు మరింత కాలం పాటూ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మాత్రం భారత్ ఆర్థిక స్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. పరిస్థితులు అక్కడి దాకా వెళ్లకపోయినప్పటకీ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మందగమనం భారత్‌ను కచ్చితంగా ప్రభావితం చేస్తుంది’ అని జీన్ వ్యాఖ్యానించారు. అనేక రంగాలు ఒడిదుగుకులను ఎదుర్కొంటాయని, అయితే వైద్య సేవల రంగం మాత్రం ఈ పరిస్థితులతో లాభపడొచ్చని తెలిపారు.


Updated Date - 2020-04-06T00:23:47+05:30 IST