కరోనా పోరులో 85 దేశాలకు భారత్ చేయూత
ABN , First Publish Date - 2020-04-29T04:04:54+05:30 IST
కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో భారత్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని భారత విదేశాంగ శాఖ చెప్తోంది.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో భారత్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని భారత విదేశాంగ శాఖ చెప్తోంది. మంగళవారం నాడు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాతో పోరాడుతున్న 85 దేశాలకు భారత్ నుంచి ఫార్మా సాయం అందుతోందని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాలో ఆఫ్రికాలోని పలు దేశాలున్నాయని పేర్కొంది. బ్రిక్స్(బీఆర్‌ఐసీఎస్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో వివిధ దేశాలకు భారత్ చేస్తున్న సాయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది.