లక్ష జనాభాకు కరోనాతో ఒకరు మరణిస్తున్నారు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2020-06-23T23:42:17+05:30 IST

లక్ష జనాభాకు కరోనాతో ఒకరు మరణిస్తున్నారు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

లక్ష జనాభాకు కరోనాతో ఒకరు మరణిస్తున్నారు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ భారతదేశంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో లక్ష జనాభాకు కోవిడ్-19 వల్ల ఒకరు మరణిస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ సగటు 6.04తో పోలిస్తే, భారతదేశంలో లక్ష జనాభాకు ఒకరు కోవిడ్-19 వల్ల మృతి చెందుతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసులను సకాలంలో గుర్తించడం, విస్తృతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ వల్ల మరణాల రేటు తగ్గిందని తెలిపింది. భారతదేశంలో ప్రస్తుతం కరోనాతో 14,011 మంది మరణించారని, 4,40,215పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.

Read more