భారత ఆర్ధిక వ్యవస్థకు కరోనా దెబ్బ.. భారీగా పడిపోయిన వృద్ధి రేటు

ABN , First Publish Date - 2020-05-29T23:48:47+05:30 IST

న్యూఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థను కరోనా దారుణంగా దెబ్బ తీసింది. భారత వృద్ధి రేటు భారీగా పడిపోయింది.

భారత ఆర్ధిక వ్యవస్థకు కరోనా దెబ్బ.. భారీగా పడిపోయిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థను కరోనా దారుణంగా దెబ్బ తీసింది. భారత వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2019-20 ఆఖరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 3.1శాతంగా నమోదైంది. 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరిన జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. 8 ప్రాధాన్యతా రంగాలు 38 శాతం నష్టాల్లో ఉన్నాయి. సిమెంట్, ఐరన్, విద్యుత్ రంగాలు భారీ నష్టాల్లో ఉన్నాయి. 


మార్చి 25 నుంచి భారత్‌లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. మే నెల 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. దాదాపు రెండు నెలల పాటు ఏ ఉత్పాదన లేకుండా అనేక రంగాలు స్థంభించిపోయాయి. తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. అనేక సంస్థలు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. లాక్‌డౌన్ నాలుగో దశ ఆరంభం నుంచే కొంత వెసులుబాటు ఇచ్చినా పూర్తి స్థాయిలో ఉత్పాదన ప్రారంభం కాలేదు. జూన్ ఒకటి నుంచి కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉండే చోట మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తారు. లాక్‌డౌన్ ఆంక్షలు తొలగినా కరోనా భయంతో ఆయా సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితులు ఇంకా కనిపించడం లేదు. అయితే కరోనాతో సహజీవనం తప్పదంటూ సగటు భారతీయుడు తిరిగి బతుకుబండి ప్రారంభించాడు. భారత ఆర్ధిక రంగం పూర్తి స్థాయిలో తిరిగి కోలుకోవడానికి మరో రెండేళ్లు పట్టవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.    

Updated Date - 2020-05-29T23:48:47+05:30 IST