కరోనా వ్యాక్సిన్‌ రేసులో భారత్‌ ముందడుగు

ABN , First Publish Date - 2020-07-15T07:11:58+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్‌, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా హెల్త్‌కేర్‌లు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లతో మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని...

కరోనా వ్యాక్సిన్‌ రేసులో భారత్‌ ముందడుగు

  • మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభం


న్యూఢిల్లీ, జూలై 14: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్‌, అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా హెల్త్‌కేర్‌లు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లతో మనుషులపై ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) మంగళవారం ప్రకటించిం ది. ఈ రెండు ఔషధ కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెరో 1000 మంది వలంటీర్లపై ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ కేండిడేట్లను పరీక్షిస్తున్నాయని వెల్లడించింది. ఏ దేశంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినా ఉత్పత్తి కావాల్సింది భారత్‌, చైనాల్లోనేనని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటి నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీపై భారత్‌తో సంప్రదింపులు మొదలుపెట్టాయన్నారు. 


Updated Date - 2020-07-15T07:11:58+05:30 IST