కరోనా... మరణాల్లోనూ చైనాను దాటేసిన భారత్

ABN , First Publish Date - 2020-05-29T18:51:29+05:30 IST

కరోనా కేసుల్లోనే కాదు... మరణాల్లోనూ చైనాను భారత్ దాటేసింది. చైనాలో కరోనా మృతులు ఇప్పటివరకు 4,634 కాగా, భారత్‌లో ఈ సంఖ్య 4,706 కు చేరుకుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారినట్టుగా తెలుస్తోంది. మరోవైపు... కరోనా కేసుల విషయంలోనూ భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా... మరణాల్లోనూ చైనాను దాటేసిన భారత్

న్యూఢిల్లీ : కరోనా కేసుల్లోనే కాదు... మరణాల్లోనూ చైనాను భారత్ దాటేసింది. చైనాలో కరోనా మృతులు ఇప్పటివరకు 4,634 కాగా, భారత్‌లో ఈ సంఖ్య 4,706 కు చేరుకుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారినట్టుగా తెలుస్తోంది. మరోవైపు... కరోనా కేసుల విషయంలోనూ భారత్ తొమ్మిదవ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.


మొత్తం 1.82 లక్షల కేసులతో జర్మనీ ఎనిమిదవ స్థానంలో వుండగా, 1.60 లక్షల కేసులతో టర్కీ పదవ స్థానంలో ఉంది. కేసులు, మరణాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అనూహ్యంగా బ్రెజిల్ రెండవ స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత వరుసగా రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌లు టాప్-10 లో ఉన్నాయి.

ఉధృతంగా... ఇక ఒక్క రోజే 7,466 పాజిటివ్ కేసులు...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగాద కొనసాగుతోంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం మరో ఏడువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇక... 175 మంది మరణించారు. 

Updated Date - 2020-05-29T18:51:29+05:30 IST