మన రికవరీ రేటు ప్రపంచంలోనే బెస్ట్: ఆరోగ్య శాఖ మంత్రి
ABN , First Publish Date - 2020-08-23T03:55:37+05:30 IST
భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు. భారత్‌లో రికవరీ రేటు 75 శాతంగా ఉందని చెప్పిన ఆయన... మరణాల రేటు కూడా అత్యల్పంగా 1.87 శాతమని తెలిపారు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షమ శాఖ మంత్రి హర్షవర్థన్ వ్యాఖ్యానించారు. భారత్‌లో రికవరీ రేటు 75 శాతంగా ఉందని చెప్పిన ఆయన... మరణాల రేటు కూడా అత్యల్పంగా 1.87 శాతమని తెలిపారు. ‘ప్రస్తుతం మన దగ్గర కరోనా పరీక్షలు చేసేందుకు 1500 ల్యాబులు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ చూడని విధంగా.. గత 24 గంటల్లో ఏకంగా 69878 కరోనా కేసులు నమోదైన సందర్భంగా మంత్రి ఈ విషయాలను ప్రస్తావించారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,22,577కు చేరడంతో రికవరీ రేటు 74.69 శాతానికి ఎగబాకింది. ఇక గత 24 గంటల్లో కొత్తగా 63,631 మంది కరోనాను జయించారు.