కొత్త స్ట్రెయిన్ల‌పై నిఘా: పక్కా ప్లాన్ రెడీ చేసిన భారత్!

ABN , First Publish Date - 2020-12-27T17:50:21+05:30 IST

బ్రిటన్‌లో పుట్టి..ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్‌ విషయంలో భారత్ కరోనా టాస్క్ ఫోర్స్ శనివారం నాడు కీలక సమావేశం నిర్వహించింది.

కొత్త స్ట్రెయిన్ల‌పై నిఘా: పక్కా ప్లాన్ రెడీ చేసిన భారత్!

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో పుట్టి..ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్‌ విషయంలో భారత్ కరోనా టాస్క్ ఫోర్స్ శనివారం నాడు కీలక సమావేశం నిర్వహించింది.  కొత్త కరోనాపై నిఘా, వ్యాప్తి అడ్డుకట్టకు సంబంధించి కీలక వ్యూహాలపై చర్చింది. బ్రిటన్‌ నుంచి భారత్‌కు తిరొగొచ్చిన 50 మంది నుంచి సేకరించిన శాంపిళ్లపై ప్రస్తుతం దేశంలోని వివిధ పరిశోధన శాలల్లో ప్రయోగాలు జరగుతున్నాయి. వీరిలో ఎవరైనా కొత్త కరోనా కాటుకు గురయ్యారో లేదో తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరగుతున్నాయి. దీని తోడు.. గత నెలలో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన వారి వివరాలు కూడా సేకరించేందుకు జిల్లా సర్వేలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. 


ఇక భవిష్యత్తులో కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశంపై కూడా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త వైరస్ రకాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకనుంచీ రాష్ట్రాల్లో నమోదవుతున్న 5 శాతం కేసుల్లో శాంపిళ్లు సేకరించి వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించనున్నారు. ఈ దిశగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆధ్వర్యంలో జినోమిక్ సర్వేలెన్స్ కన్సార్టియమ్ ఏర్పాటైంది. కొత్త వైరస్ రకాలపై నిఘా పెట్టే బాధ్యతను ఈ కన్సార్టియం తీసుకుంది. ‘ఇతర ఆర్‌ఎన్ఏ వైరస్ మాదిరిగానే కరోనాలో నిరంతరం జన్యు మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే..భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కొవడం. మాస్కులు ధరించడం వంటి నియమాల ద్వారా కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌లను నిరోధించవచ్చు..’అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 


Updated Date - 2020-12-27T17:50:21+05:30 IST