54 లక్షల కరోనా కేసులు, రికవరీ రేటు 80 శాతం

ABN , First Publish Date - 2020-09-20T21:58:33+05:30 IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 54 లక్షలకు చేరింది. ఒకే రోజులో 92,605 కొత్త కేసులు..

54 లక్షల కరోనా కేసులు, రికవరీ రేటు 80 శాతం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 54 లక్షలకు చేరింది. ఒకే రోజులో 92,605 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో వైపు దేశంలో  కరోనా మృతుల సంఖ్య 86,752కు చేరుకోగా, గత 24 గంటల్లో 1,133 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం, మొత్తం కేసుల్లో 43 లక్షల (43,03,043) మందికి పూర్తి స్వస్థత చేకూరి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి కాగా, రికవరీ రేటు 79.68కి చేరింది.


'కొత్త రికవరీ కేసుల్లో సుమారు 60 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు చెందిన కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 23,000 మందికి పైగా పేషెంట్లు రికవరీ అయ్యారు. సింగిల్ డే రికవరీలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి చెరో 10,000 మంది ఉన్నారు' అని ఆరోగ్య శాఖ తెలిపింది.

Updated Date - 2020-09-20T21:58:33+05:30 IST