క‌ట్ట‌డ‌వుతున్న‌ క‌రోనా... స్పీడీ రిక‌వ‌రీ దిశ‌గా బాధితులు!

ABN , First Publish Date - 2020-07-15T16:18:15+05:30 IST

దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో మెరుగుద‌ల క‌నిపిస్తోంది. డిశ్చార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కొన్ని రాష్ట్రాలకే....

క‌ట్ట‌డ‌వుతున్న‌ క‌రోనా... స్పీడీ రిక‌వ‌రీ దిశ‌గా బాధితులు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో మెరుగుద‌ల క‌నిపిస్తోంది. డిశ్చార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయ్యింద‌ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం నాటికి దేశంలో డిశ్చార్ అయిన బాధితుల సంఖ్య యాక్టివ్‌ కేసుల కంటే 1.8 రెట్లు అధికంగా ఉంది. మే 3న దేశంలో క‌రోనా రికవరీ రేటు 26.59 శాతంగా ఉండ‌గా, ఇప్పుడు అది 63.02శాతానికి పెరిగింది. 20 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మెరుగైన రికవరీ రేటును కలిగి ఉన్నాయ‌ని పేర్కొంది. వీటిలో లదాఖ్ అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. దేశంలో యాక్టివ్‌ కోవిడ్ కేసులలో 86 శాతం కేసులు 10 రాష్ట్రాలలోనే ఉన్నాయి. గత మూడున్నర నెలల్లో కొత్త కేసులలో రోజువారీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మార్చిలో రోజువారీ వృద్ధి రేటు 31శాతంగా ఉండ‌గా, ఇది మేలో 9శాతానికి, మే చివరి నాటికి 5 శాతానికి తగ్గింది. జూలై 12 నాటి రిక‌వ‌రీ గణాంకాలను పరిశీలిస్తే, ఇది 3.24 శాతంగా న‌మోద‌య్యింది. రోజువారీ వృద్ధి రేటు త‌గ్గుద‌ల‌కు సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీనే కార‌ణ‌మ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-15T16:18:15+05:30 IST