భారత్-చైనా ద్వైపాక్షికంగా సమస్యలు పరిష్కరించుకోగలవు: రష్యా
ABN , First Publish Date - 2020-06-23T23:04:11+05:30 IST
మాస్కో: భారత్-చైనా ద్వైపాక్షికంగా సమస్యలు పరిష్కరించుకోగలవని, మూడో పక్షం అవసరం లేదని రష్యా తెలిపింది. లడక్ గల్వాన్ లోయ ఘటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ...

మాస్కో: భారత్-చైనా ద్వైపాక్షికంగా సమస్యలు పరిష్కరించుకోగలవని, మూడో పక్షం అవసరం లేదని రష్యా తెలిపింది. లడక్ గల్వాన్ లోయ ఘటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్ చెప్పారు. రష్యా-ఇండియా-చైనా విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నాయని చెప్పారు. అందుకే ఒకరిని ఒకరు రెచ్చగొట్టేలా రెండు వైపుల నుంచి ఎలాంటి ప్రకటనలూ రాలేదని, సైన్యాధికారులు, విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. శాంతియుత పరిష్కారం తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం రష్యా మద్దతు పలుకుతుందని లవరోవ్ చెప్పారు.