తమ సైనికుల మృత దేహాలను తీసుకెళ్లేందుకు వచ్చిన చైనా హెలికాప్టర్లు
ABN , First Publish Date - 2020-06-17T03:59:48+05:30 IST
న్యూఢిల్లీ: లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు చైనా హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖ వద్దకు వచ్చాయి. ఘర్షణలో 43 మంది చైనా సైనికులు

న్యూఢిల్లీ: లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు చైనా హెలికాఫ్టర్లు వాస్తవాధీన రేఖ వద్దకు వచ్చాయి. ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మరణాలపై చైనా అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తమ వైపు కూడా నష్టం జరిగిందని మాత్రమే చైనా ఇప్పటివరకూ ప్రకటించింది.
ఇటు భారత్ వైపు నష్టం తీవ్ర స్థాయిలో ఉంది. 20 మంది భారత జవాన్లు చనిపోయారని తెలుస్తోంది. తొలుత కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మాత్రమే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదు. కేవలం బాహాబాహీ, పిడిగుద్దులు, రాళ్లతో కొట్టుకోవడం వంటి ఘటనలో ఈ మరణాలు సంభవించాయి. 20 మంది భారత జవాన్ల మృతిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.