సరిహద్దు సమస్యను కూడా రాజకీయం చేసేస్తున్నారు : లడఖ్ ఎంపీ ఫైర్

ABN , First Publish Date - 2020-06-11T21:51:09+05:30 IST

కాంగ్రెస్ వ్యవహార శైలిపై బీజేపీ లడఖ్ ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్ మరోసారి విరుచుకుపడ్డారు. భారత- చైనా

సరిహద్దు సమస్యను కూడా రాజకీయం చేసేస్తున్నారు : లడఖ్ ఎంపీ ఫైర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వ్యవహార శైలిపై బీజేపీ లడఖ్ ఎంపీ జామ్ యాంగ్ సెరింగ్ నాంగ్యాల్ మరోసారి విరుచుకుపడ్డారు. భారత- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య రాజకీయ సమస్య కాదని, దానిని రాజకీయం చేయాల్సిన అవసరమేమీ లేదని ఆయన మండిపడ్డారు. భద్రతా దళాల, జవాన్ల అమరత్వాన్ని కాంగ్రెస్ కించపరిచేలా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. సరిహద్దు సమస్యల విషయంలో మోదీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు.


2014 నుంచి ఎల్‌ఏసీ సెక్టార్లో ఒక్క అంగుళం భూమి కూడా చైనా ఆక్రమణకు గురి కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రెండ్రోజుల క్రితం కూడా రాహుల్ గాంధీ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్‌పై నాంగ్యాల్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలించిన సమయంలోనే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, అదంతా కూడా కాంగ్రెస్ చలవే అంటూ ఆధారాలతో సహా వెల్లడించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-06-11T21:51:09+05:30 IST