ప్రపంచ ఔషధ భాండాగారంగా భారత్: షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్

ABN , First Publish Date - 2020-06-22T04:15:42+05:30 IST

ప్రపంచాన్ని కరోనా అల్లాడిస్తోంది. లక్షల ప్రాణాలను బలిగొంటోంది. ఈ నేపథ్యంలో 130 కోట్ల మంది ప్రజలున్న...

ప్రపంచ ఔషధ భాండాగారంగా భారత్: షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్

షాంఘై: ప్రపంచాన్ని కరోనా అల్లాడిస్తోంది. లక్షల ప్రాణాలను బలిగొంటోంది. ఈ నేపథ్యంలో 130 కోట్ల మంది ప్రజలున్న భారత్ వంటి దేశం వణికిపోవాలి. తమను తాము రక్షించుకోవడానికి ఇతర దేశాలను సాయం కోసం అర్థించాలి. అయితే భారత్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తాను సాయం కోసం అర్థించడం విషయం పక్కన పెడితే.. 130కి పైగా దేశాలు కరోనా నుంచి కోలుకోవడానికి చేయూతనందిస్తోంది. అందులో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉండడం గమనార్హం. కరోనా నియంత్రిణ కోసం వినియోగించే అనేక ఔషధాలు భారత్ నుంచే ఆయా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయాన్ని షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇటీవల వెల్లడించింది. సంస్థ సెక్రటరీ వ్లాదిమిర్ నోరోవ్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచానికే ఔషధ భాండాగారంగా మారిందని ప్రశంశించారు. ఇప్పటికే 133 దేశాలకు కరోనా పోరాటంలో భారత్ చేయూతనందిస్తోందని చెప్పారు.


ఆయా దేశాలకు అవసరమైన ఔషధాలు భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయని, ఇది భారత్ గొప్ప మనసును చాటి చెబుతోందని నోరోవ్ కొనియాడారు. ఔషధ తయారీతో పాటు వైద్య, ఆరోగ్య విధానాల సమన్వయంలో భారత్‌కు ఉన్న అనుభవం ఎంతో గొప్పదని, అదే ప్రస్తుతం భారత్‌కు కలిసి వస్తోందని నోరోవ్ పేర్కొన్నారు. అంతేకాకుండా విపత్తులను ఎదుర్కొవడంలో భారత్ అందెవేసిన చేయని వ్లాదిమిర్ నోరోవ్ కొనియాడారు.

Updated Date - 2020-06-22T04:15:42+05:30 IST