అత్యవసర పరిస్థితుల్లో కరోనాకు ఆ మందు ఓకే.. కానీ..

ABN , First Publish Date - 2020-06-02T23:29:47+05:30 IST

కరోనాతో బాధపడుతున్న వారిని కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో రెమెడిసివిర్ ఔషధాన్ని వినియోగించేందుకు...

అత్యవసర పరిస్థితుల్లో కరోనాకు ఆ మందు ఓకే.. కానీ..

న్యూఢిల్లీ: కరోనాతో బాధపడుతున్న వారిని కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో రెమెడిసివిర్ ఔషధాన్ని వినియోగించేందుకు వైద్యశాఖ ఆమోదం తెలిపింది. గిలీడ్స్ తయారుచేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌ను కరోనా బాధితులపై వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జూన్ 1న ఆమోదం తెలిపింది. అయితే ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాలని, అది కూడా కేవలం 5 డోసులు మాత్రమే ఉపయోగించాలని తెలిపింది. ఇదిలా ఉంటే కరోనా బాధితులకు ఈ ఔషధాన్ని 5 రోజులు వినియోగించడం వల్ల కొంత ప్రభావం చూపుతోందని రెమెడిసివిర్ తయారీ సంస్థ గిలీడ్ పేర్కొంది.

Updated Date - 2020-06-02T23:29:47+05:30 IST