ఈయూతో భారత అర్థిక బంధం మరింత బలోపేతం: మోదీ

ABN , First Publish Date - 2020-07-15T19:34:45+05:30 IST

యూరోపియన్ యూనియన్‌తో భారత ఆర్ధిక, సాంస్కృతిక బంధం మరింత బలోపేతం కానున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

ఈయూతో భారత అర్థిక బంధం మరింత బలోపేతం: మోదీ

న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్‌తో భారత ఆర్ధిక, సాంస్కృతిక బంధం మరింత బలోపేతం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ ఈ మేరకు ఆకాంక్షించారు. 13 ఏళ్ల పాటు జరిగిన చర్చల అనంతరం తొలిసారి భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య మంగళవారం పౌర అణు ఒప్పందంపై సంతకాలు జరిగిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలు సహా విస్తృత స్థాయిలో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఇవాళ ఈయూ అధినేతలతో ప్రధాని చర్చలు జరపనున్నారు. ‘‘ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు భారత్‌-ఈయూ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నాను. ఈ సమావేశంతో ఈయూతో భారత ఆర్థిక, సాంస్కృతిక బంధం మరింత బలోపేతం కాగలదని బలంగా నమ్ముతున్నాను..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-15T19:34:45+05:30 IST