రాజీవ్ గాంధీ కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నా : రాహుల్

ABN , First Publish Date - 2020-08-20T17:00:22+05:30 IST

రాజీవ్ గాంధీ తనకు తండ్రి అయినందుకు చాలా చాలా గర్విస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు.

రాజీవ్ గాంధీ కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నా : రాహుల్

న్యూఢిల్లీ : రాజీవ్ గాంధీ తనకు తండ్రి అయినందుకు చాలా చాలా గర్విస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ 76 వ జయంతిని పురస్కరించుకొని రాహుల్ ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ ‘‘రాజీవ్ గాంధీ నాకు తండ్రి అయినందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. రాజీవ్ దూరదృష్టి కలవారు. దీనికంటే చాలా దయార్ద్రుడు. మానవత్వం పాళ్లు ఎక్కువగా ఉన్నవారు. ఈ రోజు ఆయన్ని మేము మిస్ అవుతున్నాం. ప్రతి రోజూ మిస్సవుతూనే ఉన్నాం’’ అని రాహుల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-20T17:00:22+05:30 IST