లాక్‌డౌన్ 4 లో హైదరాబాద్ సహా...
ABN , First Publish Date - 2020-05-17T19:31:51+05:30 IST
దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం ఆ జిల్లాల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్ 4 దాదాపు ఖాయమైన దశలో... దానిని ఎలా అమలు చేయబోతున్నాన్నది తేలాల్సి ఉంది. నేటితో మూడవ లాక్‌డౌన్ ముగియనున్న విషయం విదితమే.

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం ఆ జిల్లాల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్ 4 దాదాపు ఖాయమైన దశలో... దానిని ఎలా అమలు చేయబోతున్నాన్నది తేలాల్సి ఉంది. నేటితో మూడవ లాక్‌డౌన్ ముగియనున్న విషయం విదితమే.
ఇక లాక్‌డౌన్ 4 ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీయే స్వయంగా చెప్పారు. కాకపోతే... ఇంత కఠినంగా ఉండదని కూడా చెప్పారు కాబట్టి... అది ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కొన్ని వివరాలిలా ఉన్నాయి. దేశంలోని 80 శాతం కరోనా కేసులున్న 30 మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కేంద్రం చర్చించింది. ఈ 30 మున్సిపాలిటీల్లో కరోనా ఆంక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, మిగతా ప్రాంతాల్లో పెద్దగా ఆంక్షలు ఉండవని సమాచారం.
ఆ 30 జిల్లాల్లో ప్రజలు ఎలా ఉండాలి? వస్తు రవాణా ఎలా జరగాలన్న అంశంపై కేంద్రం పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వినికిడి. ఈ జిల్లాల్లో కఠినమైన నిబంధనలను విధించనున్నట్లు లుస్తోంది.
ఇక ఆ జిల్లాలు... గ్రేటర్ హైదరాబాద్, బృహన్ ముంబై, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పుణె, కోల్‌కతా, జైపూర్, నాసిక్, జోధ్‌పూర్, ఆగ్రా, తిరువళ్లూర్, ఔరంగాబాద్, కడలూరు, సూరత్, చెంగల్పట్టు, హౌరా, అరియాలూర్, కుందూర్, భోపాల్, అమృత్‌సర్, మీరట్, విల్లుప్పురం, వడోదర, ఉదయ్‌పూర్, పాల్ఘర్, బెహ్రాంపూర్, సోలాపూర్, మీరట్.
ఈ 30 మున్సిపల్ కార్పొరేషన్‌లలో తప్ప మిగతా చోట్ల దాదాపుగా పెద్ద కండీషన్లేవీగా ఉండబోవని తెలుస్తోంది. ఓ అంచనా ప్రకారం... మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తారని తెలుస్తోంది.