అలా కూడా... కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2020-08-20T18:56:00+05:30 IST

కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్న అంశంపై విస్తృతంగా జరుగుతోన్న పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే విషయమై పలు అంశాలను ఇప్పటి వరకూ పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా వైరస్ వ్యాప్తి మరో విధంగా కూడా జరుగుతుందని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు.

అలా కూడా... కరోనా వ్యాప్తి

హైదరాబాద్ : కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్న అంశంపై విస్తృతంగా జరుగుతోన్న పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుందనే విషయమై పలు అంశాలను ఇప్పటి వరకూ పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా వైరస్ వ్యాప్తి మరో రకంగా కూడా జరుగుతుందని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. 


తాజాగా ముక్కు, నోటి ద్వారా కాకుండా మలమూత్రాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు. మురుగునీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లున్నాయని తాము గుర్తించినట్లు సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చారు. మురుగునీటి నమూనాలను పరిశీలించి కరోనా వైరస్‌ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. వ్యాధి సోకిన 35 రోజుల వరకు రోగి శరీరంలో వైరస్‌ ఉంటుందని తద్వారా విసర్జితాల్లోనూ వైరస్ విడుదల ఉంటుందని సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో వెల్లడైంది.


హైదరాబాద్‌లో దాదాపు రెండు లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఉదయ్ కిరణ్, కుంచా సంతోష్ కుమార్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు మనుపాటి హేమలత, హరీష్ శంకర్, వెంకట మోహన్ ఈ పరిశోధనలు చేశారు. ఇక హైదరాబాద్‌లో దాదాపు ఆరు లక్షల మంది కరోనా బారినపడినట్టు సీసీఎంబీ - సీఎస్‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. 

Updated Date - 2020-08-20T18:56:00+05:30 IST