అమెరికాను ఓవర్‌ టేక్ చేసిన చైనా! గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి!

ABN , First Publish Date - 2020-04-08T21:37:24+05:30 IST

ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్న దేశాల జాబితాలో చైనా అగ్ర స్థానానికి చేరకుంది.

అమెరికాను ఓవర్‌ టేక్ చేసిన చైనా! గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి!

వాషింగ్టన్: అగ్రరాజ్యంగా ఎదగాలనేది చైనాకు ఎప్పటినుంచో ఉన్న బలమైన కోరిక. అయితే ఈ దిశగా చాలా కాలం క్రితమే అక్కడి ప్రభుత్వాలు పగడ్బందీగా అడుగులు వేయడం మొదలెట్టాయి.  ఆ ప్రయత్నాల ఫలితాలన్ని గత దశాబ్దకాలంగా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్న దేశాల జాబితాలో చైనా అగ్ర స్థానానికి చేరకుంది. గత 40 ఏళ్లుగా అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ స్థానాన్ని తాజాగా చైనా హస్తగతం చేసుకుంది. ప్రపంచ దేశాల మధ్య పేటెంట్ ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా సంస్థలే ఇప్పటి వరకూ తమ ఆవిష్కరణలపై అధిక సంఖ్యలో పేటేంట్ల కోసం దరఖాస్తూ చేస్తూ వచ్చాయి. తాజాగా చైనా సంస్థలు అమెరికాను అధికమించాయి.


గత 20 ఏళ్లలో చైనా కంపెనీల పెటెంట్ల దరఖాస్తుల్లో 200 శాతం వృద్ది నమోదైందని ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ వద్ద నమోదైన గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక అత్యథిక సంఖ్యలో పేటెంట్లకు దరఖాస్తు చేస్తున్న కార్పొరేట్ సంస్థగా చైనాకు చెందిన హువావే అవతరించింది. గత మూడేళ్లుగా సదరు సంస్థ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. తయారీ రంగానికే పరిమితమైన చైనాను మేథో సంపత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకున్న చైనా పాలకుల ప్రయత్నాలే పేటెంట్ల రూపంలో ఫలితాన్ని ఇస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2020-04-08T21:37:24+05:30 IST