ప్రధాని మోదీ డిక్టేటర్..అసోం మాజీ సీఎం విమర్శ

ABN , First Publish Date - 2020-05-18T16:57:35+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గగోయ్ సంచలన విమర్శలు చేశారు...

ప్రధాని మోదీ డిక్టేటర్..అసోం మాజీ సీఎం విమర్శ

గువహటి (అసోం): ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గగోయ్ సంచలన విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలు, నిపుణులను సంప్రదించకుండానే దేశంలో మొదటిసారి ఆకస్మికంగా లాక్ డౌన్ విధించారని తరుణ్ గగోయ్ ఆరోపించారు. ప్రధాని ఏకపక్షంగా లాక్ డౌన్ విధించిన డిక్టేటర్ అని తరుణ్ గగోయ్ ఆరోపించారు. దేశంలో కరెన్సీనోట్లను రద్దు చేసి ప్రధాని మోదీ మొదటి తప్పు చేశారని, ఎలాంటి ప్రణాళిక లేకుండా దేశంలో జీఎస్టీని అమలు చేసి మూడో తప్పు చేశారని తరుణ్ గగోయ్ ఆరోపించారు. ప్రధాని మోదీ విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ చిన్నభిన్నం అయిందని, లాక్ డౌన్ ను ఆకస్మికంగా అమలు చేయడం వల్ల మిలియన్ల మంది వలసకార్మికులు అవస్థలు పడుతున్నారని ఆయన చెప్పారు. నాయకుడైన ప్రధాని నిపుణులను సంప్రదించకుండా నియంతలాగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆకస్మిక  లాక్ డౌన్ వల్ల వలసకార్మికులతో పాటు రైతులు, చేనేత కార్మికులు, పాలఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు, పౌల్ట్రీ రంగ వ్యక్తులు, రోజువారీ కూలీలు, చిన్న పరిశ్రమల యజమానులు దెబ్బతిన్నారని తరుణ్ గగోయ్ వివరించారు.

Updated Date - 2020-05-18T16:57:35+05:30 IST