మా గోడు పట్టించుకోండి: ప్రవాసులు

ABN , First Publish Date - 2020-06-06T07:28:40+05:30 IST

తమ గోడు ఎవరికీ పట్టడం లేదని హెచ్‌1బీ వీసాపై ఉన్న పలువురు భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌

మా గోడు పట్టించుకోండి: ప్రవాసులు

వాషింగ్టన్‌, జూన్‌ 5: తమ గోడు ఎవరికీ పట్టడం లేదని హెచ్‌1బీ వీసాపై ఉన్న పలువురు భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధించిన వీసా ఆంక్షల వల్ల అమెరికాలో జన్మించిన వారి చిన్నారులు భారత్‌కు వెళ్లేందుకు అర్హులు కాకపోవడమే ఇందుకు కారణం.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌లో ఇప్పటివరకు 1.07 లక్షల మంది స్వదేశానికి తిరిగి రాగలిగారు. కానీ కొందరు చిన్నారులు అమెరికాలో జన్మించడం, వారి తల్లిదండ్రులతో పాటు భారత్‌కు ప్రయాణించేందుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోవడంతో పలువురు భారతీయ జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. తమతో పాటు తమ చిన్నారులు ప్రయాణించేలా భారత ప్రభుత్వం ఆంక్షలను సడలించాలని వారు కోరుతున్నారు.  

Updated Date - 2020-06-06T07:28:40+05:30 IST