దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు

ABN , First Publish Date - 2020-12-19T13:39:10+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం ఉదయం చలిగాలుల ప్రభావం పెరిగింది....

దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారం ఉదయం చలిగాలుల ప్రభావం పెరిగింది. వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-6 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయని కేంద్ర వాతావారణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.ఢిల్లీ నగరంలో సోమవారం వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. శనివారం ఢిల్లీ నగరాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. వచ్చే వారంలో ఉత్తరభారతదేశంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సగటున 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో వణుకుతున్నాయని, వచ్చే వారం వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 

Read more