కేంద్ర జీవో ఉపసంహరించుకోవాలని ఐఎంఏ వైద్యుల నిరసన
ABN , First Publish Date - 2020-12-11T23:47:56+05:30 IST
ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతినిస్తూ కేంద్రం ఇచ్చిన జీవోను ..
గౌహతి: ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతినిస్తూ కేంద్రం ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సభ్యులు, డాక్టర్లు శుక్రవారంనాడు నిరనస చేపట్టారు. దీనిపై ఐఎంఏ అసోం రాష్ట్ర చీఫ్ సత్యజీత్ బోరా మాట్లాడుతూ, ఆధునిక వైద్య విధానాన్ని సాంప్రదాయ వైద్య విధనంతో వాళ్లు (కేంద్రం) మిళితం చేస్తున్నారని, సర్జన్ కావడానికి 8 నుంచి 10 ఏళ్లు పడుతుందని, ఆయుర్వేద వైద్యులను శస్త్రచికిత్సలకు అనుమతిస్తే మూడేళ్ల శిక్షణ మాత్రమే ఉంటుందన్నారు. ఇది ప్రజలపై ప్రయోగం చేయడమేనని ఆయన తప్పుపట్టారు. రెండు వైద్య విధానాలను కలిపే 'మిక్సోపతి'కి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం వెంటనే సంబంధిత జీవోను ఉపసంహరించుకోవాలని అన్నారు.
ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్లను మోడ్రన్ మెడిసన్ సర్జరీకి అనుమతించడాన్ని అనుమతించే నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారంనాడు దేశవ్యాప్త నో-డిమోనిస్ట్రేషన్ స్ట్రైక్‌కు ఐఎంఏ పిలుపునిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య సర్వీసులకు అంతరాయం తలెత్తింది. అసోంలోనూ ఎమర్జెన్సీ, కోవిడ్ కేర్ సర్వీసులను మినహా ఇతర వైద్య సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
కాగా, ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను శస్త్రచికిత్సకు అనుమతిస్తే దేశంలోని ఆరోగ్య పరిరక్షణ రంగంలో అవినీతి చోటుచేసుకుని, అతిపెద్ద తప్పదానికి దారితీస్తుందని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ తెలిపారు. వైద్యుడు కావాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుందని, మిక్సోపతి వల్ల ఏమి కోరుకుంటున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆరోగ్యంపై దేశం రాజీపడితే అదొక పెద్ద వైఫల్యమవుతుందని అన్నారు. సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్యులు డ్యూటీలో నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె పాటించారు.